![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) అభిమానులకు ఒక అదిరిపోయే వార్త వినిపిస్తోంది. ప్రముఖ వెబ్ సిరీస్ మేకర్స్ రాజ్ & డికె (Raj & DK) దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక భారీ సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజ్ & డికె ద్వయంలో రాజ్ ఎవరో కాదు.. సమంత భర్త రాజ్ నిడిమోరు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజ్ & డికె కలయికలో సరికొత్త ప్రయోగం:
‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి వెబ్ సిరీస్‌లతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన రాజ్ & డికె, ఇప్పటివరకు టచ్ చేయని ఒక వైవిధ్యమైన కథను సల్మాన్ కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇది కేవలం సాధారణ యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా, అత్యాధునిక హంగులతో కూడిన ‘సూపర్ హీరో’ తరహా చిత్రమని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్‌ను ఇప్పటివరకు ఎన్నడూ చూడని రీతిలో ఈ సినిమాలో ప్రజెంట్ చేయబోతున్నారట.
షూటింగ్ అప్‌డేట్:
తాజా నివేదికల ప్రకారం, ఈ భారీ ప్రాజెక్టు షూటింగ్ అక్టోబర్ 2026 నుంచి ప్రారంభం కానుంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తయ్యాక 2026 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ లోపు రాజ్ & డికె తమ స్క్రిప్ట్ పనులను పూర్తి చేయడమే కాకుండా, విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన ముందస్తు పనులను కూడా పూర్తి చేయనున్నారు.
సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్, రాజ్ & డికెల క్రియేటివ్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇండియన్ సినిమాలోనే ఇది ఒక బిగ్గెస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
![]() |
![]() |